ఏకగ్రీవంగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక

ఏకగ్రీవంగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక

వరంగల్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతుందన్నారు మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి. హన్మకొండ హరిత కాకతీయ హోటల్ లో కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ కార్పొరేటర్లతో వారు సమావేశమయ్యారు. కొన్ని సమీకరణాల దృష్ట్యా పార్టీ అధిష్టానం మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ఎంపిక చేసిందన్నారు మంత్రులు. విప్ ధిక్కరిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన వారిలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ రావడం బాధాకరమన్నారు. వారికి వీడియో కాల్ ద్వారా ప్రమాణ స్వీకారం, మేయర్ ఎన్నికలో పాల్గొనే అవకాశం కల్పించారన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే జరుగుతుందన్నారు.