వీడియో: బూతులు తిట్టుకుంటూ పోలింగ్ బూత్ లోకి వెళ్లిన గంగుల కమలాకర్

వీడియో:  బూతులు తిట్టుకుంటూ పోలింగ్ బూత్ లోకి వెళ్లిన గంగుల కమలాకర్

కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ హల్ చల్ చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కరీంనగర్ జిల్లా పరిషత్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ బూతు వద్ద తన అనచరులతో కలిసి హడావుడి చేశారు. దీంతో మంత్రిని లోపలకు అనుమతించేందుకు ఆయనను మాజీ మేయర్ రవీందర్ సింగ్ నిరాకరించారు. కండువాలతో రావద్దని ఆయన అనడంతో.. ఇవి పార్టీ కండువాలు కావని.. దేవుడికి సంబంధించిన కండువాలు అని మంత్రి వాగ్వాదానికి దిగారు. పోలింగ్ బూత్ లోకి వస్తూ(పరోక్షంగా రవీందర్ సింగ్ ను ఉద్దేశించి) అసభ్య పదాలు ఉపయోగించారు మంత్రి గంగుల కమలాకర్.దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 

ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ 1324లో వెయ్యి మంది  తమ వాళ్ళే.. అన్నారు. 986 కి ఒక్కటి తగ్గినా మా క్రమశిక్షణ తగ్గినట్టే అన్నారు. 
బీజేపీ, కాంగ్రెస్ మాకు బలం లేదని తప్పుకున్నామని చెప్పారు. ఏకగ్రీవం ఎందుకు కావాలని..కడుపు కళ్ళ మంటతో..తమలో చిచ్చు పెట్టాలని కొందరు నామినేషన్ వేశారని మంత్రి ఆరోపించారు. ఎవరి మద్దతో తెలియదు బరిలో నిలిచాడంటూ విమర్శలు చేశారు. ఎన్నిక దాదాపు ఏకపక్షమన్నారు గంగుల.  కరీంనగర్ మున్సిపాలిటీ లో 14 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 14 మంది ఓట్లు మీకు పడతాయా చూసుకోండి. బీజేపీ ఓట్లు మొత్తం మీకు పడతాయా అంటూ రవీందర్ సింగ్ కు సవాల్ విసిరారు మంత్రి గంగుల. 

పడకపోతే ఎవరు బాధ్యత వహిస్తారు..బండినా ..ఈటలనా? అంటూ ప్రశ్నించారు. 
సికండి రాజకీయాలు ఎందుకు..? తల తెగినా మేము టీ ఆర్ ఎస్ వైపే అంటూ మంత్రి సీరియస్ కామెంట్స్ చేశారు. ఈ ఎన్నిక తర్వాత రాజకీయ పరిణామాలు మారుతాయి. రాష్ట్రం సాధించిన హక్కు దార్లం మేమే అన్నారు. సికండి రాజకీయాలు చేసేవారు కేసీఆర్ ముందు మాడిమసి అయి పోతారన్నారు. రవీందర్ సింగ్ ను పోటి లో పెట్టింది బండినా ? ఈటల రాజేందరా? ఎవరు నిలబెట్టారు..? అంటూ ప్రశ్నించారు. క్రమశిక్షణకు మారు పేరు టీఆర్ఎస్ అన్నారు గంగుల.