ప్రజలు ఆందోళన చెందొద్దు  

ప్రజలు ఆందోళన చెందొద్దు  

ప్రజలు ఆందోళన చెందొద్దు  
జిల్లాలో ప్రస్తుతం 6 కొవిడ్ కేసులు
బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి కమలాకర్

కరీంనగర్ సిటీ, వెలుగు: వర్షాలు, దోమల వల్ల  వచ్చే డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు జిల్లాలో కంట్రోల్‍ లో ఉన్నాయని బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. సీజనల్‍ ఫీవర్‍ వార్డులో రోగులను పరామర్శించారు. బ్లడ్ బ్యాంక్‍లోని ప్లేట్ లెట్ మిషిన్ను, క్యాంటీన్ పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని  తెలిపారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొంటామని, ప్రజలు భయాందోళనకు గురికావద్దన్నారు. ప్రైవేటు ఆస్పత్రి రోగుల నుంచి సేకరించిన బ్లడ్ శాంపిల్స్ ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తే పరీక్షలు జరిపి డెంగీ నిర్ధారణ చేస్తారన్నారు. జిల్లాలో ప్రస్తుతం 6 కొవిడ్ కేసులున్నాయని ముగ్గురు ప్రభుత్వ ఆస్పత్రిలో, మరో ముగ్గురు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. మలేరియా కేసులు నమోదు కాలేదని, 13 మందికి టైఫాయిడ్ పరీక్షలు చేయగా ఒకరికి, 22 మందికి డెంగీ పరీక్షలు చేస్తే ఇద్దరికి పాజిటివ్ వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్లేట్ లెట్ మిషిన్ అందుబాటులో ఉందని తెలిపారు. సమావేశంలో కలెక్టర్ కర్ణన్, మేయర్ సునీల్ రావు, జిల్లా పరిషత్ చైర్​పర్సన్ విజయ, సూపరింటెండెంట్​రత్నమాల, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జువేరియా పాల్గొన్నారు.

222 మందికి చెక్కుల పంపిణీ..
కరీంనగర్ టౌన్: ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా సీఎం కేసీఆర్ ఆడ బిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇస్తున్నారని మినిస్టర్​ కమలాకర్ అన్నారు. గురువారం స్థానిక జడ్పీ మీటింగ్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో 222మందికి రూ.2.22 కోట్ల విలువగల చెక్కులను అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కరోనా లాంటి క్లిష్టపరిస్థితి ఎదురైనా చెక్కుల పంపిణీని అపలేదని గుర్తు చేశారు. అనంతరం స్థానిక నగరపాలక సంస్థ ఆవరణలో 10ఫాగింగ్ యంత్రాలను మేయర్, కమిషనర్, కార్పొరేటర్లతో కలిసి మంత్రి ప్రారంభించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇప్పటికే ఉన్న ఫాగింగ్ యంత్రాలకు తోడు అదనంగా రూ.5.15లక్షల వ్యయంతో 10 హ్యాండ్ యంత్రాలను కొనుగోలు చేశామన్నారు. నగర ముఖద్వారం వద్ద రూ.5 కోట్లతో మహా భారత్ థీమ్ మోడల్ లో గొప్ప ఐలాండ్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే సేఫ్ గా ఉన్న సిటీల్లో కరీంనగర్ ఒకటని మంత్రి పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మేయర్ సునీల్ రావు, జడ్పీ చైర్ పర్సన్ విజయ, కమిషనర్ ఇస్లావత్, ఈఈ కిష్టప్ప, మహేందర్, కార్పొరేటర్లు మాధవి, శ్రీకాంత్, రమణారావు, యాదవ్, ఎంపీపీలు లక్ష్మయ్య, శ్రీలత, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రాజు, కార్పొరేటర్లు మాధవి, జయశ్రీ లీడర్లు పాల్గొన్నారు.