ఎఫ్‌‌సీఐ బియ్యం త్వరగా తరలించాలి

ఎఫ్‌‌సీఐ బియ్యం త్వరగా తరలించాలి

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా మిల్లింగ్ ప్రారంభమైందని, దీనికి అనుగుణంగా బియ్యాన్ని వేగంగా తరలించే ఏర్పాట్లు చేయాలని సివిల్‌‌ సప్లయ్స్‌‌శాఖ మంత్రి గంగుల కమలాకర్‌‌  అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ధాన్యం మిల్లింగ్ తీరుపై శుక్రవారం హైదరాబాద్‌‌లోని మినిస్టర్స్‌‌ క్వార్టర్స్‌‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ 45రోజుల తరువాత ఎఫ్‌‌సీఐ సీఎంఆర్ అనుమతించిన నేపథ్యంలో మిల్లింగ్ ప్రక్రియ వేగంగా పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. దానికి అనుగుణంగా బియ్యాన్ని తరలించడానికి గూడ్సు రైళ్ల ర్యాక్‌‌ మూమెంట్ పెంచాలన్నారు. మిల్లింగ్ ప్రక్రియలో వేగం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, సివిల్ సప్లైస్ అధికారులను ఆదేశించారు. సీఎంఆర్ గడువును పెంచాలని ఇప్పటికే కేంద్రానికి లెటర్‌‌ రాశామని తెలిపారు. గోదావరి వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మిల్లింగ్ ప్రక్రియ పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయి మిల్లింగ్ నిర్వహించే విధంగా రైస్ మిల్లర్లు, సివిల్ సప్లయిస్ అధికారులు పనిచేయాలని చెప్పారు.