ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల సమీక్ష

ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల సమీక్ష

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇవాళ వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్ లో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.

మాయిశ్చర్ మిషన్లు, ప్యాడీక్లీనర్లు, గన్నీ బ్యాగులు సరిపడినంత అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు గత సంవత్సరం ఇదే రోజుతో పోలిస్తే దాదాపు 83వేల మెట్రిక్ టన్నులు ఎక్కువగా సేకరించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోతలకు అనుగుణంగా 4579 కొనుగోలు కేంద్రాలను తెరిచామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన F.A.Q వచ్చిన ధాన్యం వెంటనే సేకరిస్తామన్నారు.