26 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినం : మంత్రి గంగుల కమలాకర్

26 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినం : మంత్రి గంగుల కమలాకర్

26 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినం
మంత్రి గంగుల కమలాకర్ 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని 4.16 లక్షల మంది రైతుల నుంచి దాదాపు 26 లక్షల టన్నులను సేకరించినట్లు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఈ ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటే 8 లక్షల టన్నుల ధాన్యాన్ని ఎక్కువగా సేకరించినట్లు పేర్కొన్నారు. కోతలు జరుగుతున్న ప్రాంతాల్లో 6,129 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడమే కాకుండా, 35 సెంటర్లలో కొనుగోళ్లు పూర్తిచేసి వాటిని మూసి వేశామని తెలిపారు.

ఇప్పటి వరకు రూ.2,154 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. నవంబర్, డిసెంబర్ నెలల్లోనే కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఎక్కువగా వస్తుందని, అందుకను గుణంగానే ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. గన్నీలు, టార్పాలిన్లు, మాయిశ్చర్ మిషన్లు, ప్యాడీ క్లీనర్లు తదితరాలు అందుబాటులో ఉంచామని తెలిపారు.