రాహుల్ పై అనర్హత వేటు మోడీ నియంతృత్వానికి పరాకాష్ట : మంత్రి జగదీష్ రెడ్డి

రాహుల్ పై అనర్హత వేటు మోడీ నియంతృత్వానికి పరాకాష్ట : మంత్రి జగదీష్ రెడ్డి

రాహుల్ గాంధీపై అనర్హత వేటు మోడీ నియంతృత్వానికి పరాకాష్ట అని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. దీనితో మోడీ అసలు స్వరూపం బట్టబయలు అయిందని మండిపడ్డారు. దేశంలో చీకటి రోజులు వచ్చాయని..అణిచివేత మోడీ సర్కార్ ఎంచుకున్న మార్గమని విర్శించారు. ఎనిమిదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న తంతు అనచివేయమే అన్నారు జగదీష్ రెడ్డి. ప్రతిపక్షాలను అణిచివేతకే ఈడి, ఐటి, సిబిఐ లను వినియోగించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ దుర్మార్గాలకు ప్రజలు చరమ గీతం పాడుతారని తెలిపారు మంత్రి జగదీష్ రెడ్డి

ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించి మూడు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా మార్చి 24న నల్లగొండ జిల్లా కేంద్రంలో సహకార బంధువుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. రైతాంగాన్ని రక్షించేందుకే బీఆర్ఎస్ స్థాపన జరిగిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. దేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని ఆయన తెలిపారు. హస్తినాలో రైతు పోరాటాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ని కదిలించాయన్నారు. మానవీయ కోణంలోనే సరిహద్దు ప్రాంతాల్లో రైతాంగానికి బాసటగా నిలుస్తున్నామని చెప్పారు మంత్రి జగదీష్ రెడ్డి. 

కుట్రలను, కుతంత్రాలను ఛేదించి ప్రాజెక్ట్ ల నిర్మాణం చేశామని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. విద్యుత్ సరఫరా నియంత్రణకై మోడీ సర్కార్ రూట్ మ్యాప్ గిసిందని.. అయినా తెలంగాణాలో నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ రంగంలో నల్లగొండ జిల్లా అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. తెలంగాణ పాలనలో కరువు జిల్లాలో రికార్డ్ సృష్టించింది వరి దిగుబడి.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే అందుకు కారణని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.