V6 News

బొగ్గు నాణ్యతాప్రమాణాలు పెంచుకోవాలి : మంత్రి కిషన్ రెడ్డి

బొగ్గు నాణ్యతాప్రమాణాలు పెంచుకోవాలి : మంత్రి కిషన్ రెడ్డి
  • కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి పిలుపు
  • దేశవ్యాప్త బొగ్గు గనుల
  • పనితీరుపై అధికారులతో సమీక్ష​

హైదరాబాద్, వెలుగు:  ప్రతి ప్రభుత్వ సంస్థ బొగ్గు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మార్కెట్​లో నిలదొక్కుకోవాలని కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సూచించారు. మంగళవారం ఢిల్లీ నుంచి దేశవ్యాప్త బొగ్గు కంపెనీల పనితీరుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోని బొగ్గు వినియోగదారులు తమకు నచ్చిన గ్రేడ్ బొగ్గును పొందేవిధంగా నేషనల్ కోల్ ఎక్స్చేంజ్ ద్వారా బొగ్గు అమ్మకం విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ప్రభుత్వ సంస్థలు పోటీ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి బొగ్గు నాణ్యతా పాటించడం అత్యవసరమన్నారు. ఉత్పత్తి వ్యయం తగ్గించుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. మార్కెట్లలో నిలదొక్కుకోవడానికి సింగరేణి సంస్థ నాణ్యమైన బొగ్గును తక్కువ ధరకు అమ్మడానికి కృషి చేయాలని సూచించారు. కొత్త గనులను చేపడుతూ నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని పిలుపునిచ్చారు. 

కొత్త ఓపెన్‌కాస్ట్ గనులకు అనుమతులు..!

హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి సంస్థ సీఎండీ డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. ఈ ఏడాది ఐదు కొత్త ఓపెన్ కాస్ట్ గనుల ప్రారంభానికి అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి సంస్థ వినియోగదారులకు మరింత నాణ్యమైన బొగ్గును అందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సమావేశంలో సింగరేణి భవన్ నుంచి సంస్థ డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కె.వేంకటేశ్వర్లు, బి.వెంకన్న, ి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ టెర్రరిస్టు అంటూ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. ఈ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు.