నవంబర్ 19 నుంచి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు : మంత్రి కోమటిరెడ్డి

నవంబర్ 19 నుంచి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు : మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లో నవంబర్ 19 నుంచి 22 వరకు 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్    (ఐఆర్​సీ) సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. శుక్రవారం సదస్సు ఏర్పాట్లపై సెక్రటేరియట్ లో మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ 19న కేంద్ర మంత్రి నితిన్​గడ్కరీ, సీఎం రేవంత్ రెడ్డి  ఐఆర్​సీని ప్రారంభిస్తారని తెలిపారు. హైటెక్​సిటీలో నిర్వహించే ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి 3 వేల మంది డెలిగేట్స్ హాజరవుతున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా రహదారుల నిర్మాణం, భద్రత, టెక్నాలజీపై నిపుణులతో గ్రూప్ డిస్కషన్స్​జరుగుతాయని పేర్కొన్నారు.

శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ డీపీఆర్​సిద్ధం

సుమారు రూ.7,600 కోట్ల అంచనా వ్యయంతో 52 కిలోమీటర్లు ప్రతిపాదించిన శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ పై కేంద్ర మంత్రి నితిన్​గడ్కరీతో ప్రకటన చేయిస్తామని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు డీపీఆర్​సిద్ధమైందన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి భూసేకరణ పూర్తయిందన్నారు. 161.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు మరోసారి టెండర్లు పిలుస్తామని తెలిపారు.