సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌‌లో ఆస్ట్రేలియా 187/6

సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌‌లో ఆస్ట్రేలియా 187/6

డర్బన్‌‌: సౌతాఫ్రికాతో  శుక్రవారం మొదలైన తొలి టెస్ట్‌‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌‌లో తడబడింది. మ్యాట్‌‌ రెన్‌‌షా (46 బ్యాటింగ్‌‌), పాట్‌‌ కమిన్స్‌‌ (33 బ్యాటింగ్‌‌) పోరాడటంతో.. వర్షం వల్ల తొలి రోజు ఆట ముగిసే టైమ్‌‌కు ఆసీస్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 65.2 ఓవర్లలో 187/6 స్కోరు చేసింది. టాస్‌‌ నెగ్గిన ఆసీస్‌‌కు స్టార్టింగ్‌‌లోనే సఫారీ బౌలర్లు చుక్కలు చూపెట్టారు. దాంతో 24 రన్స్‌‌కే ఓపెనర్లు నిక్‌‌ మాడిసన్‌‌ (0), ట్రావిస్‌‌ హెడ్‌‌ (9) ఔటయ్యారు. 

లబుషేన్‌‌ (37), స్టీవ్‌‌ స్మిత్‌‌ (25) మూడో వికెట్‌‌కు 60 రన్స్‌‌ జోడించి ఇన్నింగ్స్‌‌ను గాడిలో పెట్టారు. నాలుగు బాల్స్‌‌ తేడాలో ఈ ఇద్దరూ ఔటయ్యారు. తర్వాత రెన్‌‌షా నిలకడగా ఆడినా.. అలెక్స్‌‌ కెరీ (14), బ్యూ వెబ్‌‌స్టర్‌‌ (4) నిరాశపర్చారు. మార్కో యాన్‌‌సెన్‌‌, వియాన్‌‌ ముల్డర్‌‌, అన్రిచ్‌‌ నోర్జ్‌‌ తలా రెండు వికెట్లు తీశారు.