ఇండియాతో టీ20 సిరీస్కు ముందు కివీస్కు గాయాల బెడద

ఇండియాతో టీ20 సిరీస్కు ముందు కివీస్కు గాయాల బెడద

ఆక్లాండ్‌‌: ఇండియాతో టీ20 సిరీస్‌‌కు ముందు న్యూజిలాండ్‌‌ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ఇంజ్యురీస్‌‌తో స్టార్‌‌ బ్యాటర్‌‌ మార్క్‌‌ చాప్‌‌మన్‌‌, పేసర్‌‌ జాక్‌‌ ఫౌల్క్స్‌‌ ఈ సిరీస్‌‌కు దూరమయ్యారు. గత నెల యూరోపియన్‌‌ టీ20 లీగ్‌‌లో ఎడమ హ్యామ్‌‌స్ట్రింగ్‌‌ ఇంజ్యురీకి గురైన చాప్‌‌మన్‌‌ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. టీమిండియాతో వన్డే సిరీస్‌‌ వరకు అతను అందుబాటులోకి రానున్నాడు. కాంటర్‌‌బరీలో జరిగిన ప్రాక్టీస్‌‌ సెషన్‌‌లో కుడి తుంటి కండరాల గాయానికి గురైన ఫౌల్క్స్‌‌ కోలుకునే సమయంపై స్పష్టత లేదు. గాయపడిన ఈ ఇద్దరి స్థానాల్లో ఆల్‌‌ రౌండర్‌‌ జోష్‌‌ క్లార్క్‌‌సన్‌‌, బ్లెయిర్‌‌ టిక్నర్‌‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ నెల 22 నుంచి టీ20 సిరీస్‌‌ మొదలవుతుంది. 

న్యూజిలాండ్ టీ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌‌వెల్, జోష్ క్లార్క్‌‌సన్‌‌ , డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, బెవోన్ జాకబ్స్, కైల్ జేమిసన్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్.