మహిళలపై దాడులు పెరుగుతున్నయ్: రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద

మహిళలపై దాడులు పెరుగుతున్నయ్:  రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద
  •  హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ బతుకమ్మ సంబురాలు

వరంగల్, వెలుగు: సమాజంలో మహిళలపై దాడులు, ఆకృత్యాలు పెరుగుతుండటం ఆందోళనకరమని రాష్ట్ర మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద అన్నారు. శుక్రవారం గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పర్యటించిన ఆమె, హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని పాటలకు అనుగుణంగా ఆడిపాడారు.

ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ మహిళలు విద్యార్థి దశ నుంచే తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంచుకోవాలని, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. మహిళలకు రాత్రి 9 గంటలకే స్వేచ్ఛ, భద్రత కరువవడం విచారకరమన్నారు. మహిళల పట్ల పురుషుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చినప్పుడే సమానత్వ సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మహిళల హక్కులపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

హనుమకొండ ఆర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీ కేంద్రంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కుడా చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుండు సుధారాణి, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వి.రామచంద్రం, పాలకమండలి సభ్యురాలు బి.రమాదేవి, డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనితారెడ్డి, నాయిని నీలిమ, మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సభ్యురాలు రాధాబాయి, ఆర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుంకరి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.