జహీరాబాద్లో జీవీ షాపింగ్ మాల్ ప్రారంభం

జహీరాబాద్లో జీవీ షాపింగ్ మాల్ ప్రారంభం

మెదక్ (జహీరాబాద్), వెలుగు: జహీరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జీవీ షాపింగ్ మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్న నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

నూతన వ్యాపార సంస్థల ఏర్పాటుతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పట్టణ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను అందిస్తూ, వారి నమ్మకాన్ని పొందాలని, జీవీ షాపింగ్ మాల్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండప్ప, పార్టీ మొగుడంపల్లి, కోహీర్, ఝరాసంగం మండలాల అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, నర్సింలు, వెంకటేశం, కౌన్సిలర్లు యాకూబ్, అబ్దుల్లా, జాకీర్, గౌస్ గోరి, మహిపాల్ యాదవ్, విశ్వేశ్వర్, ప్రవీణ్, శంకర్ రెడ్డి, పాండు, జాహెద్, రాజు తదితరులు 
పాల్గొన్నారు.