పుదుచ్చేరి: ఆస్ట్రేలియా–ఎతో జరిగిన రెండో వన్డేలోనూ ఇండియా– ఎ టీమ్ బ్యాటర్లు మళ్లీ ఫెయిలయ్యారు. టార్గెట్ ఛేజింగ్‌లో రజత్ పటీదార్ (67) ఒంటరి పోరాటం చేసినా... మిగతావారి నుంచి సహకారం లేకపోవడంతో.. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా 69 రన్స్ తేడాతో ఆసీస్ చేతిలో పరాజయం చవిచూసింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరోటి మిగిలి ఉండగానే కంగారూలు 2–0తో కైవసం చేసుకున్నారు. టాస్ గెలిచిన ఆసీస్ 49.5 ఓవర్లలో 275 రన్స్‌కు ఆలౌటైంది. సామ్ కాన్‌స్టాస్ (67), జోష్ ఫిలిప్పీ (58), నాథన్ మెక్‌స్వీని (32), మిచెల్ ఓవెన్ (25), లాచ్లాన్ షా (25) రాణించారు.
అర్షద్ ఖాన్ 3, యష్ ఠాకూర్ 2 వికెట్లు తీశారు. తర్వాత ఇండియా 45.2 ఓవర్లలో 206 రన్స్‌కే ఆలౌటైంది. అనుకూల్ రాయ్ (34 నాటౌట్), విప్రాజ్ నిగమ్ (23) పోరాడినా.. దేవదత్ పడిక్కల్ (1), రుతురాజ్ గైక్వాడ్ (12), సాయి సుదర్శన్ (13) తక్కువ స్కోరుకే ఔటయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్పెన్సర్ జాన్సన్ 3 వికెట్లు తీశాడు. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన మూడో వన్డే ఆదివారం జరుగుతుంది.
