ఉద్యమంగా బహుజన బతుకమ్మ ఉత్సవాలు.. 18 వరకు కొనసాగునున్న యాత్ర

ఉద్యమంగా బహుజన బతుకమ్మ ఉత్సవాలు.. 18 వరకు కొనసాగునున్న యాత్ర

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజల సాంస్కృతిక ప్రతీక, పోరాటాల స్ఫూర్తితో సాగే బహుజన బతుకమ్మ ఉత్సవాలను పండుగగా మాత్రమే కాకుండా చైతన్యవంతమైన ఉద్యమంగా జరుపుకోవాలని బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ పిలుపునిచ్చింది. గ్రామీణ ఉపాధి, స్వయం సమృద్ధి, జెన్ జీ ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఈనెల 18 వరకు వివిధ జిల్లాల్లో ఉత్సవాలను నిర్వహించనున్నారు.

8న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన ఈ ఉత్సవాల యాత్ర.. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటకు చేరుకుంది. 11న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మండలం  మొండికుంట, 12న సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలంలోని ముక్కుడు దేవులపల్లి, 13న జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలం ధర్మాపురం,14న రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌‌‌‌‌‌‌‌మెట్ మండలం కవాడిపల్లి, 15న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో, 16న వేములవాడ, 17న సిద్ధిపేట జిల్లా రాయపోలులో, 18న రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్, సాయంత్రం 4 గంటలకు వికారాబాద్ జిల్లాలోని  దేవనోని గూడెంతో ఈ యాత్ర ముగుస్తుంది.