భద్రాద్రి రాముడి కల్యాణానికి రండి...గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు మంత్రి కొండా సురేఖ ఆహ్వానం

భద్రాద్రి రాముడి కల్యాణానికి రండి...గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు మంత్రి కొండా సురేఖ ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు: భద్రాచలం  సీతారాముల కల్యాణ మహోత్సవానికి రావాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. సోమవారం  లోక్ భవన్‌‌లో గవర్నర్‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

27న భద్రాద్రిలో జరగనున్న కల్యాణోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. గవర్న ర్‌‌కు ఆలయ అర్చకులు వేదాశీర్వచ నం ఇచ్చి, స్వామివారి ప్రసాదాలు అందించారు. ఎమ్మెల్యే కోరెం కనకయ్య, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.