
హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓడితే అధికారం పోదు.. గెలిస్తే ఢిల్లీలో అధికారం రాదన్నారు మంత్రి కేటీఆర్. హుజూరాబాద్ తమ దృష్టిలో చిన్న ఎన్నిక, ప్రతి నిమిషం దాని చుట్టే ఆలోచనల్లేవన్నారు. హుజురాబాద్ లో దళితబంధు సక్సెస్ అయితే దేశం తెలంగాణను చూస్తదన్నారు. హుజురాబాద్ టీఆరెస్ పార్టీకి కంచుకోట అన్నారు. సార్వత్రిక ఎన్నికకు ఇంకా రెండున్నర యేళ్ల సమయం ఉందన్నారు. 70 యేళ్లు మంచి నీళ్ళు ఇవ్వన్నీ వాళ్ళు, దద్దమ్మలు మేము తెచ్చిన దళిత బంధు పై మాట్లాడుతున్నారన్నారు. ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో తమకు తెలుసని.. కోడిగుడ్డు మీద ఈకలు పీకడం ఆపాలన్నారు. ఈ సంవత్సరంలోనే నవంబర్ లేదా అక్టోబర్ చివరిలో పార్టీ ద్విదశాబ్ది ఉత్సవ సభ నిర్వహిస్తామన్నారు కేటీఆర్.