డీజే టిల్లు, మల్లారెడ్డి మాస్ డ్యాన్స్

డీజే టిల్లు, మల్లారెడ్డి మాస్ డ్యాన్స్

బీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి సందర్బం వచ్చిన ప్రతిసారి ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తన మాటతోనే కాదు చేతలతోనూ ప్రజలను ఆకర్షిస్తూ ఉంటారు. తాజాగా డీజే టిల్లుతో కలిసి మల్లారెడ్డి స్పెప్పులు వేశారు. కుత్భుల్లాపూర్ మైసమ్మ గూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా  కైట్ ఫెస్టివల్, ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. మల్లారెడ్డి విద్యాసంస్థల్లో చదువుకుంటున్న దాదాపు 25వేల మంది విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో సిద్ధూ, దేవి శ్రీ ప్రసాద్, డైరెక్టర్ బాబీ, డ్యాన్స్ మాస్టర్ శేఖర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో డీజే టిల్లు సినిమాలో మాస్ సాంగ్ అయిన టైటిల్ సాంగ్ డీజే టిల్లుకు హీరో సిద్ధుతో పాటు మంత్రి మల్లారెడ్డి స్టెప్పులేశారు. డీజే టిల్లు పాటకు హీరో సిద్ధు మంత్రి మల్లారెడ్డితో సిగ్నేచర్ స్టెప్పులు వేయించారు. కాసేపు వేదికపై డ్యాన్స్ చేసి సందడి చేశారు. 

మల్లారెడ్డి కళాశాలలో ఇంత పెద్ద ఎత్తున పిల్లల కోసం ప్రోగ్రాం చేయడం చాలా సంతోషంగా ఉందని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. చదువుతో పాటు, మానసిక ఉల్లాసం తోడయ్యేలా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి కొత్త సినిమా వాల్తేరు వీరయ్యలోని 4వ పాటను దేవి శ్రీ ప్రసాద్, శేఖర్ మాస్టర్, డైరెక్టర్ బాబీతో కలిసి మంత్రి రిలేజ్ చేశారు. ఇక మంత్రి మల్లారెడ్డి, హీరో సిద్ధూ కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.