అత్యధికంగా మునుగోడులోనే  రైతు బంధు ఇస్తున్నం : మంత్రి నిరంజన్ రెడ్డి

అత్యధికంగా మునుగోడులోనే  రైతు బంధు ఇస్తున్నం : మంత్రి నిరంజన్ రెడ్డి

వ్వవసాయానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని..వ్యవసాయానికి  నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందజేస్తున్నామని చెప్పారు. 30లక్షల మోటార్లకు ఫ్రీ కరెంట్ అందిస్తున్నామన్నారు. 50 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎన్నో కేసులు వేశారని.. వాటిని మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొన్నామన్నారు. అన్నదాతల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధును ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. 

మిషన్ భగీరథ ద్వారా మునుగోడులో ఫ్లోరోసిస్ ను సమూలంగా నిర్మూలించామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా మునుగోడు నియోజకవర్గంలోనే  రైతు బంధు ఇస్తున్నామన్నారు. తొమ్మిది విడతల్లో 1,031 కోట్ల రూపాయలను అన్నదాతల ఖాతాల్లో జమ చేశామన్నారు.  రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. చేపల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.