- అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీసీ నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఇందులో ఈవీ అంశాన్ని చేర్చాలని సూచించారు. శుక్రవారం సెక్రటేరియట్‌లో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి, బీసీ గురుకుల సెక్రటరీ సైదులు, అధికారులు అలోక్ కుమార్, మల్లయ్య భట్టుతో మంత్రి రివ్యూ చేపట్టారు. శాఖలో పెండింగ్ అంశాలపై చర్చించారు.
మహత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ప్రక్రియను వేగవంతం చేయాలని, విదేశాల్లో ఉన్న స్టూడెంట్స్ ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చాటిన బీసీ గురుకులాల విద్యార్థులను త్వరలో సన్మానించాలని నిర్ణయించారు. గ్రీన్ ఛానల్ ద్వారా హాస్టళ్లు, గురుకుల స్కూళ్ల అద్దెలు చెల్లించేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. జూన్ 15న అకడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే నాటికి విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్, షూస్ చేరేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

