- కుల పెద్దలతో త్వరలో మీటింగ్
- మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
రవీంద్రభారతి, వెలుగు: సగర కులస్తుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం రవీంద్రభారతిలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సగర భగీరథ మహర్షి జయంతి వేడుకలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. సగర కులస్తులను బీసీ-–డి నుంచి మార్పు చేయడం, జీవో నెంబర్ 59 వంటి కీలక అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. వీటిపై చర్చించేందుకు కుల పెద్దలతో త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జూజుల శ్రీనివాస్ గౌడ్, సగర సంఘం ప్రతినిధులు శేఖర్ సగర, సత్యం, కుమారస్వామి, గుజ్జ కృష్ణ, స్రవంతి మణిమంజరి పాల్గొన్నారు.

