హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో రేణుక ఎల్లమ్మ తల్లికి మంత్రి పొన్నం పూజలు

హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో రేణుక ఎల్లమ్మ తల్లికి మంత్రి పొన్నం పూజలు

హుస్నాబాద్, వెలుగు: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన జన్మదినం సందర్భంగా శుక్రవారం హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దండి లక్ష్మి, వైస్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు ఏర్పాటు చేసిన 59 కేజీల భారీ కేక్ ను కట్ చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ మంత్రి ఉత్సాహంగా గడిపారు. 

తన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన అవగాహన కల్పించారు.