విజయ డెయిరీ ప్లాంట్ పనులను పరిశీలించిన మంత్రి తలసాని

విజయ డెయిరీ ప్లాంట్ పనులను పరిశీలించిన మంత్రి తలసాని

సీఎం కేసీఆర్ చొరవతోనే రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తుక్కుగుడా మున్సిపాలిటీ రావిర్యాలలో కొత్తగా నిర్మిస్తున్న విజయ డెయిరీ మెగా ప్లాంట్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని.. రూ. 250 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న అత్యాధునిక విజయ డెయిరీ మెగా ప్లాంట్ ఆగస్ట్ నాటికి ప్రారంభం అవుతుందన్నారు. సీఎం కేసీఆర్ చొరవతోనే పాడి పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందుతోందని.. ఇందుకోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తుందని చెప్పారు. 

ఉమ్మడి రాష్ట్రంలో నష్టాల్లో ఉన్న విజయ డెయిరీ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.700 కోట్ల టర్నోవర్ సాధిస్తోందని మంత్రి తలసాని చెప్పారు. కొత్తగా 2 వేల డెయిరీ ఔట్ లెట్ లను ప్రారంభించామని, త్వరలో మరో 2 వేలం ఏర్పాటు చేసే లక్ష్యంతో పని చేస్తున్నట్లు చెప్పారు. కొత్త ఔట్ లెట్ల ఏర్పాటుతో వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని మంత్రి చెప్పారు.