Bhogi 2026: తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబురాలు

Bhogi 2026: తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబురాలు

తెలుగు రాష్ట్రాల్లో  సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. మూడు రోజుల  వేడుకల్లో భాగంగా తొలి రోజు  భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లెలు, పట్నాలు అన్న తేడా లేకుండా జనం పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకున్నారు. తమ లోగిళ్ల ముందు భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. ఆ తర్వాత తమ ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ సందడి చేశారు. 

హైదరాబాద్ లోని పలు చోట్ల  రాత్రి నుండే గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రజలు ఆనందంగా భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయారు.భోగి మంటల చుట్టూ ఉత్సాహంగా ఆడిపాడారు.  ఈ ఉత్సవాల్లో చిన్నాపెద్దా  తేడాలేకుండా సందడి చేశారు. 

దక్షిణాయనానికి, ధనుర్మాసానికి చివరి రోజు భోగి. ఇళ్లలోకి భోగభాగ్యాలను ఆహ్వానించే రోజు ఇది. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలు ఇంటికిచేరే రోజు. రైతులతోపాటు అందరి ముఖాల్లో నవ్వులు పూసే రోజు. భోగి అంటే ‘తొలినాడు’ అని ఒక అర్థం ఉంది. కొత్త సంవత్సరంలో పండుగలు భోగితోనే మొదలవుతాయి. ఈ రోజున ఇంటి ముందు భోగి మంట వేస్తే ఇంట్లోని చెడు, దరిద్రాన్ని తొలగించుకున్నట్లే అని నమ్మకం.