ఇండస్ట్రియల్ భూముల్లో కుంభకోణానికి అవకాశమే లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (హిల్ట్) పాలసీతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. ఒకరు 9 వేల ఎకరాలు కొల్లగొడుతుందని..మరొకరు రూ. 5 లక్షల కోట్ల స్కామ్ అని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు ఇందులో స్కాం ఎక్కడుందో బయటపెట్టాలన్నారు. ఇండస్ట్రియల్ పాలసీపై ప్రతిపక్షాలవి అసత్య ప్రచారం అని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ ఏం చేసినా..బీఆర్ఎస్ అడ్డుకోవాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై బురద జల్లే కుట్రలను ప్రజలు గమనించాలన్నారు.
మీడియాతో మాట్లాడిన మంత్రి ఉత్తమ్. హైదరాబాద్ ను పొల్యూషన్ ఫ్రీ చేయడం కోసమే పాలసీ తెచ్చాం. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి పొల్యూషన్ చేరింది. ఢిల్లీ పరిస్థితి మనకు రాకూడదనే కొత్త ఇండస్ట్రియల్ పాలసీ పారిశ్రామిక వేత్తలను ఎంకరేజ్ చేయడానికి ఇన్సెంటీవలు ఇస్తున్నాం. కాలుష్య పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు పంపేందుకే చర్యలు. కాంగ్రెస్ ఏం చేసినా బీఆర్ఎస్ బురద జల్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పాలసీ అర్థం కాక చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఓ పెద్దమనిషి తాము అధికారంలోకి వస్తే పాలసీ రద్దు చేస్తామంటున్నారు. వారు అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు. విద్యుత్ ప్లాంట్ల ఇష్యూలో అసలు అవినీతి జరగలేదు.
ఏంటి హిల్స్ పాలసీ
హైదరాబాద్ సిటీ లోపల ఉన్న కాలుష్యకారక, ఔట్డేటెడ్టెక్నాలజీతో నడుస్తున్న పరిశ్రమలను ఔటర్రింగ్రోడ్(ఓఆర్ఆర్) అవతలకు తరలించేందుకు సర్కారు కసరత్తు ప్రారంభించింది. బాలానగర్, కాటేదాన్, కూకట్‌పల్లి, ఉప్పల్, జీడిమెట్ల, చర్లపల్లి తదితర 22 ఇండస్ట్రియల్ఏరియాల్లోని భూములను ఇతర అవసరాలకు వాడుకునేలా కొత్త పాలసీ తీసుకొచ్చింది. ఇందుకోసం హైదరాబాద్ఇండస్ట్రియల్ ల్యాండ్స్ట్రాన్స్ఫర్మేషన్పాలసీ (హెచ్ఐఎల్‌టీపీ)ని అమలు చేయనుంది. ఈ మేరకు శనివారం ఇండస్ట్రీస్, కామర్స్డిపార్ట్మెంట్ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 22 ఇండస్ట్రియల్ ఏరియాల్లోని 9,292.53 ఎకరాల భూములను ఇతర అవసరాలకు వాడుకునేందుకు మార్చుకునేలా అవకాశం కల్పించింది. ఈ మొత్తం భూముల్లో నిర్మాణాలు చేపట్టినవి (ప్లాటెడ్) 4,740.14 ఎకరాలు అని పేర్కొంది.
