తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమిట్‌‌‌‌‌‌‌‌కు రండి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమిట్‌‌‌‌‌‌‌‌కు రండి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్–2047 గ్లోబల్ సమిట్’కు రావాలని జమ్మూ-కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు. శుక్రవారం ఢిల్లీలోని జమ్మూకాశ్మీర్ హౌస్‌‌‌‌‌‌‌‌లో సీఎం అబ్దుల్లాను మంత్రి కలిసి, ఆహ్వాన పత్రికను అందజేశారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతున్నదని వివరించారు. 

నీతి అయోగ్ సలహాలు సూచ నలతో పాటు.. అన్ని రంగాల నిపుణుల మేధో మథ నంతో తయారు చేసిన విజన్ డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌ను గ్లోబల్ సమిట్‌‌‌‌‌‌‌‌లో ఆవిష్కరించనున్నట్లు ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ వెల్ల డించారు. సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోన్న గ్లోబల్ సమిట్ విజయంవంతం కావాలని ఆకాంక్షించారు. మంత్రి తో భేటి అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘గ్లోబల్ సమిట్ సక్సెస్‌‌‌‌‌‌‌‌ కావాలని ఆశిస్తున్నా. 

హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందని విశ్వసిస్తున్న’’అని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌‌‌‌‌‌‌‌కి తనను ఆహ్వానించినందుకు తెలంగాణ సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్​కు ధన్యవాదాలు తెలిపారు. ముందుగా నిర్ణయించిన పలు కార్యక్రమాలు, పలు అభివృద్ధి పనుల కారణంగా సమిట్‌‌‌‌‌‌‌‌కు హాజరు కాలేకపోతున్నట్లు ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు.