50 లక్షల టన్నుల వడ్లు కొన్నం... 2023తో పోలిస్తే మూడింతలు ఎక్కువ: మంత్రి ఉత్తమ్

50 లక్షల టన్నుల వడ్లు కొన్నం... 2023తో పోలిస్తే మూడింతలు ఎక్కువ: మంత్రి ఉత్తమ్
  • యాసంగిలో 70 లక్షల టన్నుల ధాన్యం కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నం 
  • రైతులకు ఎలాంటి సమస్యలు రానివ్వొద్దు
  • తడిసిన వడ్లు కూడా కొంటం.. రైతు సంక్షేమమే మా ధ్యేయం
  • కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్​లో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: యాసంగి సీజన్​లో 50 లక్షల టన్నుల ధాన్యం కొన్నామని సివిల్ సప్లయ్స్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6‌‌‌‌‌‌‌‌0.14 లక్షల ఎకరాల్లో వరి సాగైందని తెలిపారు. 1.29 కోట్ల టన్నుల వడ్ల దిగుబడి సాధించామని చెప్పారు. 70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని తెలిపారు. ఇప్పటి దాకా 50 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్లు వివరించారు. 2023 యాసంగి సీజన్​లో మే 15 నాటికి 25 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. 

ఈ యాసంగి సీజన్​లో అదే తేదీ నాటికి 50 లక్షల టన్నులు సేకరించినట్లు ఉత్తమ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టిందన్నారు. ఈ యాసంగి సీజన్​లో ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై మంత్రి ఉత్తమ్ సమీక్షించారు. సెక్రటేరియెట్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోళ్ల కోసం 8,348 కేంద్రాలు ఏర్పాటు చేశాం. 2021–-22 యాసంగి సీజన్‌‌తో పోలిస్తే ఈ సీజన్‌‌లో 1,739 కొనుగోలు కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేసినం. రికార్డ్ స్థాయిలో వరి సాగు చేయడంతో అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచినం. తడిసిన వడ్లను కూడా కొంటాం. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి’’అని మంత్రి ఉత్తమ్ అన్నారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

కొనుగోళ్ల ప్రక్రియను కలెక్టర్లంతా క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ‘‘రానున్న 10-, 12 రోజుల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. క్షేత్ర స్థాయిలో లోపాలను గుర్తించి సత్వరమే పరిష్కరించాలి. ధాన్యం కొనుగోళ్లపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. నిజాలను ప్రజలకు వివరించి రైతులకు భరోసా కల్పించాలి’’అని ఉత్తమ్ సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, సివిల్ సప్లయ్స్​ శాఖ ప్రధాన కార్యదర్శి డీఎస్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. 

ఇక కవిత ఇప్పటికే  బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బహిరంగ విమర్శలు చేస్తున్నదన్నారు. తన మీద జరుగుతున్న దుష్ప్రచారం వెనుక ఎవరున్నారో తనకు తెలుసని కవిత అంటోందని, మొత్తానికి  కల్వకుంట్ల కుటుంబంలో పదవుల కోసం రాజకీయ ఆధిపత్య పోరు మొదలైందని చెప్పారు. హరీశ్ రావుతో చర్చల మతలబు ఏమిటో ప్రజలకు చెప్పాలని కేటీఆర్ ను రామచంద్ర నాయక్  డిమాండ్ చేశారు.