బీఆర్ఎస్ స్వాధీనం చేసుకున్న ఇందిరమ్మ ఇండ్లను తిరిగి ఇప్పిస్తా : బాధితులకు మంత్రి వివేక్ భరోసా

బీఆర్ఎస్ స్వాధీనం చేసుకున్న ఇందిరమ్మ ఇండ్లను తిరిగి ఇప్పిస్తా : బాధితులకు మంత్రి వివేక్ భరోసా

బీఆర్ఎస్ హయాంలో స్వాధీనం చేసుకున్న ఇందిరమ్మ ఇండ్లను తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బుధవారం (జులై 09) గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి వివేక్.. వివిధ జిల్లాల ప్రజల నుంచి వినతులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రజా సమస్యలను తెలుసుకుని  కలెక్టర్లతో మాట్లాడటం జరిగిందని అన్నారు. దళితుల భూమి సమస్యలపై వికారాబాద్ కలెక్టర్ తో మాట్లాడామని.. సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించనున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ కామెంట్స్:

  • ప్రజాసమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకే మంత్రితో ముఖాముఖి కార్యక్రమం
  • మంత్రులు, ఎమ్మెల్యేలు జనంలో ఉండాలని సీఎం ఆదేశించారు
  • ముఖాముఖి కార్యక్రమానికిఅన్ని జిల్లాల నుంచి ప్రజలు అర్జీలు ఇచ్చారు
  • డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళితుల సమస్యలపై వికారాబాద్, హైదరాబాద్ కలెక్టర్లతో మాట్లాడాను
  • అన్ని జిల్లాల ప్రజలు అర్జీలు ఇచ్చారు
  • కొందరికి అడ్మిషన్స్, కొందరికి ఇండ్లు.. మొదలైన అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది
  • సంబంధిత శాఖలతో మాట్లాడటం జరిగింది
  • కొన్ని అర్జీలను స్పాట్ లోనే పరిష్కరిస్తున్నాం
  • ఇది ఒక మంచి కార్యక్రమం
  • దీని వలన ప్రభుత్వంపై ప్రజల నాడి తెలుస్తుంది
  • బీఆర్ఎస్ హయాంలో పోలీస్ వ్యవస్థ ఇష్టారీతిన ఉండేది
  • స్వేచ్ఛను హరించారు.. చెన్నూరులో పోలీస్ రాజ్యం ఉండేది
  • ఇప్పటి వరకు 18 నెలల్లో ఎవ్వరిపైనా మేము కేసులు పెట్టలేదు
  • గత 10 ఏండ్లు మంత్రులతో ప్రజలు మాట్లాడే అవకాశం లేదు 
  • పాశమైలారం  ఘటన జరిగిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు 
  • గతంలో కొండ గట్టు ఘటన జరిగితే కేసీఆర్ పరామర్శించిన పాపాన పోలేదు
  • పాశమైలారం ఘటన వద్దకు సీఎం వెళ్లినా కూడా సీఎం వెళ్ళలేదు అని కేటీఆర్ ట్వీట్ చేశారు
  • బీఆర్ఎస్ హయాంలో పోలీసుల పహారా ఉండేది
  • కానీ.. మేము ప్రజల కోసం, ప్రజాధరణ కోసం పనిచేస్తున్నాం
  • కాంగ్రెస్ ప్రభుత్వం డెమొక్రటిక్  వే లో నడుస్తోంది
  • కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన గ్యారెంటీలు అమలుకు ప్రయత్నం చేస్తున్నాం
  • కేటీఆర్ కు, కవితకే పంచాయితీ ఉంది.. నియోజకవర్గంలో ఉండదా..?
  • తెలంగాణ ఉద్యమంలో పనిచేసినా.. కేసీఆర్ దిగిపోవాలని కూడా బాగా పనిచేశా.. 
  • నియోజకవర్గంలో ఎమ్మెల్యేలే సుప్రీం
  • ఇన్నాళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టత ఇచ్చారు
  • మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జాయిన్ అయ్యి పార్టీ కోసం పనిచేసిన వారికి కూడా కొంత ప్రాధాన్యత ఇవ్వాలని  సూచించారు
  • పీసీసీ పదవులు.. పార్టీ పదవుల గురించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పరిశీలిస్తు్న్నారు.. 
  • పాత, కొత్త విబేధాలు లేవు.. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం
  • డీసీసీ ప్రసిడెంట్ల గురించి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది
  • పార్టీలో కష్టపడిన వారికి ప్రాధాన్యత ఉంటుంది
  • రేపటి (జులై 10) కేబినెట్ లో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ గురించే చర్చ ఉంటుంది..
  • గత కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు అమలు అవుతున్నాయో లేదో డిస్కషన్ ఉంటుంది.
  • గిగ్ వర్కర్ల చట్టం గురించి ప్రిపరేషన్స్ నడుస్తున్నాయి.. గిగ్ వర్కర్స్ హక్కుల కోసం చర్యలు తీసుకుంటాం
  • గిగ్ వర్కర్లకు న్యాయం చేయాలని అగ్రిగేటర్లకు సూచించాం.. వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పాం..
  • సీఎం సలహా మేరకు అసెంబ్లీలో పెట్టే అవకాశం ఉంది
  • కార్మికుల హక్కులు కాపాడేందుకు నిర్ణయం తీసుకుంటున్నాం
  • సిగాచి.. 43 మంది చనిపోయిన ఘటనలో ఎంక్వైరీ చేయాల్సి ఉంది..
  • డిసెంబర్ లో ఇన్ స్పెక్టర్ రిపోర్టు ఇచ్చారు.. అందులో అన్నీ మెన్షన్ చేశారు.. 
  • సూచనలు పాటించి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు
  • మేనేజ్మెంట్, ఫెడరేషన్స్ తో25 న మీటింగ్ ఉంది.. 
  • ఈజ్ ఆఫ్ డూయింగ్ కు అవకాశం ఇచ్చినప్పుడు సిస్టమ్స్ ఫాలో అవ్వాలి
  • రూల్స్, రెగ్యులేషన్ ఫాలో అయితే ఇలాంటి ఘటనలు జరగవు.