
జూబ్లీహిల్స్ లో ప్రతి కార్యకర్త కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న రహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డిని మంత్రి వివేక్,పొన్నం కలిసి బుజ్జగించారు. రానున్న రోజుల్ల పార్టీ మరిన్ని అవకాశాలు ఇస్తుందని చెప్పారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి వివేక్.. జూబ్లీహిల్స్ సీటును చాలా మంది ఆశించారు ..అధిష్టానం నవీన్ యాదవ్ పేరు ప్రకటించింది. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ గెలుపుకోసం పనిచేయాలని సూచించారు. జూబ్లీహిల్స్ లో హయ్యెస్ట్ మెజారిటీ రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని సీఎన్ రెడ్డికి రిక్వెస్ట్ చేశామన్నారు. అందరికి జూబ్లీహిల్స్ లో సామూచిత ప్రాధాన్యం ఇస్తామన్నారు వివేక్.
గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం పని చేశామన్నారు కార్పొరేటర్ సీఎన్ రెడ్డి. ఆరోజు కాంగ్రెస్ పార్టీకి 25 వేల మెజార్టీ ఇచ్చామని చెప్పారు. ఇంచార్జి మంత్రుల సహకారంతో జూబ్లీహిల్స్ లో దశబ్దాలుగా పెండింగ్ లో ఉన్న పనులు చేయించామన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో మంత్రులు చెప్పినట్లు నియోజకవర్గంలో చిన్న చిన్న విభేదాలు ఉన్న పక్కన పెట్టి కాంగ్రెస్ జెండా ఎగురా వేస్తామన్నారు. అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం పని చేస్తామన్నారు. 10 ఏళ్ళ కంటే ఈ రెండేళ్లలో జరిగిన అభివృద్దే ఎక్కువన్నారు సీఎన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి సూచనతో ముందుకు వెళ్తాం... పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు . జూబ్లీహిల్స్ లో మంచి మెజారిటీతో అభ్యర్తిని గెలిపించుకుంటామన్నారు.