మంత్రి వివేక్‌‌కు శంషాబాద్‌‌ ఎయిర్‌‌పోర్టులో ఘన స్వాగతం

మంత్రి వివేక్‌‌కు  శంషాబాద్‌‌ ఎయిర్‌‌పోర్టులో  ఘన స్వాగతం

గండిపేట, వెలుగు: జపాన్‌‌ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌‌కు తిరిగి వచ్చిన మంత్రి వివేక్‌‌ వెంకటస్వామికి శంషాబాద్‌‌ ఎయిర్‌‌పోర్టులో కాంగ్రెస్‌‌ పార్టీ కార్యకర్తలు, మాల మహానాడు నాయకులు, కాకా అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బంజారాహిల్స్‌‌లోని మినిస్టర్‌‌ క్వార్టర్స్‌‌కు చేరుకున్న మంత్రి వివేక్‌‌ వెంకటస్వామికి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

జపాన్‌‌ పర్యటనలో వివిధ అంశాలపై జరిగిన చర్చలు, అక్కడి అభివృద్ధి నమూనాలు, పెట్టుబడులు, పారిశ్రామిక రంగంలోని అవకాశాలపై నేతలు, కార్యకర్తలతో వివేక్‌‌ వెంకటస్వామి మాట్లాడారు. అనంతరం మినిస్టర్‌‌ క్వార్టర్స్‌‌లో పలు ఫైళ్లపై మంత్రి సంతకాలు చేశారు. పార్టీకి సంబంధించిన అంశాలతో పాటు తనకు వచ్చిన పలు వినతులను ఆయన పరిశీలించారు.