గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ శుక్రవారం పర్యటించారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్, శ్రమశక్తి అవార్డు గ్రహీత, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ పి.మల్లికార్జున్– శశికళ దంపతుల కొడుకు ఫణి యశ్వంత్, గాయత్రి శ్రీప్రియ వివాహం జరగగా గోదావరిఖని ఆర్ఆర్ గార్డెన్లో రిసెప్షన్‌కు మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, తదితరులు హాజరై కొత్తదంపతులను ఆశీర్వదించారు.
అంతకుముందు గోదావరిఖని బృందావన్ గార్డెన్లో జరిగిన ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ కోటేశ్వర్లు–శ్యామల దంపతుల కూతురు అక్షయ–శశిధర్ వివాహానికి హాజరై ఆశీర్వదించారు. మంత్రి, ఎంపీ వెంట ఐఎన్‌టీయూసీ జాతీయ నాయకులు సలీంపాష, జి.కుమారస్వామి, లీడర్లు డి.మల్లేశ్, మల్లేశ్ యాదవ్, అనుమాస శ్రీనివాస్ (జీన్స్), మధు, జావెద్, నర్సింగ్ దొర, ఎం.దీపక్, తదితరులున్నారు.
శ్రమశక్తి అవార్డు గ్రహీతను సన్మానించిన మంత్రి
కోల్‌బెల్ట్, వెలుగు: మే డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి శ్రమశక్తి అవార్డు పొందిన మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన డీసీసీ జనరల్ సెక్రటరీ, కార్మిక లీడర్ పుల్లూరి లక్ష్మణ్‌ను మంత్రి శుక్రవారం సన్మానించారు. కార్మికరంగానికి మరింత సేవలు అందించాలని సూచించారు. మందమర్రి ఆర్ఐ గణపతి రాథోడ్ బర్త్‌డే వేడుకలు, జైపూర్ మండలం మిట్టపల్లి సర్పంచ్ మనోహర్ గృహప్రవేశ కార్యక్రమంలో, క్యాతనపల్లిలో పలు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.
క్యాతనపల్లి కాకతీయ కాలనీలో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గోపతి రాజయ్య తల్లి లక్ష్మి దశదినకర్మకు హాజరయ్యారు. కోటపల్లి మండలం అన్నారం గ్రామానికి చెందిన మార్కెట్‌కమిటీ డైరెక్టర్శశిపాల్రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి 9వ రోజు కార్యక్రమంలో మంత్రి పాల్గొని సంతాపం ప్రకటించారు.
