జూన్ 6 వరకు ధాన్యం కొనుగోళ్లు.. లక్ష 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

జూన్ 6 వరకు ధాన్యం కొనుగోళ్లు.. లక్ష 70  వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని అన్నారు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. గతేడాదితో పోల్చితే ఈసారి పంట దిగుబడి ఎక్కువగా వచ్చినట్లు చెప్పారు. 2026 మే 28వ తేదీన మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బావురావుపేట ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.  గత ఏడాది లక్ష 10 వేల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు జరిపితే ఈ ఏడాది లక్ష 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరుగుతుందని చెప్పారు. జూన్ 6 వరకు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. 

మంత్రి వివేక్ కామెంట్స్:

  • పెద్దపల్లి కి మూడు గోడౌన్స్ అలాట్మెంట్ చేయడం జరిగింది.
  • హామాలీల కొరతతో కొంచెం ఆలస్యం జరిగింది.
  • మొత్తం 80 లారీలతో త్వరలోనే రైతుల నుంచి చివరి గింజ వరకు కొని మిల్లులకు తరలిస్తాం.
  • కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరుగుతుంటే బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొడుతున్నారు.
  • పార్టీలకు అతీతంగా రైతులకు భరోసా కల్పించకుండా ఆందోళనలు చేసేలా రెచ్చగొడుతున్నారు
  • బాల్క సుమన్ ను ప్రజలు ఓడగొట్టారు.. ఆ ఫ్రస్ట్రేషన్ లో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారు.
  • బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ ధర్నాలు చేస్తున్నా  రైతులు రావట్లేదని బాల్క సుమన్ అన్నాడు
  • లక్ష కోట్ల ప్రాజెక్టు అని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కమీషన్లు తీసుకున్నారు.
  • కానీ రైతాంగానికి ఒక్క చుక్క నీరు అందలేదు.
  • కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో నష్టపోయిన రైతులకు నేను నష్ట పరిహారం అందించాను.
  • గత బీఆర్ఎస్ హయాంలో మిల్లుల ముందు వందల లారీలు నిలిచిపోయేవి ఇప్పుడు అలా ఏం లేదు.
  • చట్టాన్ని చేతుల్లో తీసుకుని షో చేయాలని బాల్క సుమన్ చూస్తున్నాడు
  • సింగరేణి భవన్ నీ కాల్చాలి, రైలు పట్టాలు కోయాలి అని చట్టాన్ని అతిక్రమించి మాట్లాడుతున్నారు
  • బాల్క సుమన్ స్వతహాగా ఒప్పుకున్నాడు ధర్నాలకు రైతులు వస్తలేరు అని
  • కావాలనే కార్యకర్తలను రెచ్చగొట్టి ఇక్కడ ఆందోళనలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు
  • ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే సహించేది లేదు చట్టపరమైన చర్యలు తప్పవు
  • గత ఎన్నికల్లో  రూ.100 కోట్లు ఖర్చు చేశాడు. అన్ని డబ్బులు బాల్క సుమన్ కి ఎక్కడివి..?
  • బాల్క సుమన్ చేసిన చట్ట వ్యతిరేక వ్యాఖ్యలకు కేటీఆర్ సమాధానం చెప్పాలి
  • చట్టప్రకారం చేయాలి అని స్టేట్మెంట్ లు ఇచ్చే  కేటీఆర్ బాల్క సుమన్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలి
  • బాల్క సుమన్ అరెస్ట్ అయితే జైలుకు వెళ్లి పరామర్శించిన కేటీఆర్.. 
  • బాల్క సుమన్ చట్ట వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే ఎందుకు స్పందించడం లేదు
  • అంటే బాల్క సుమన్ వ్యాఖ్యలను కేటీఆర్ సమర్ధిస్తున్నారా..? 
  • ప్రజలందరూ గమనిస్తున్నారు..
  •  రాజకీయాల్లో ఎప్పుడూ పలువురికి ఆదర్శంగా నిలవాలి
  • రెచ్చగొట్టి విధ్వంసాలకి  గురిచేసి ప్రజలను, నాయకుల ను తప్పు తోవ పట్టించరాదు