కన్ఫర్డ్ ఐఏఎస్ రేసులో మంత్రుల పీఎస్​లు, ఓఎస్​డీలు

కన్ఫర్డ్ ఐఏఎస్ రేసులో మంత్రుల పీఎస్​లు, ఓఎస్​డీలు
  • డీవోపీటీకి 25 మందితో లిస్ట్​ పంపిన రాష్ట్ర ప్రభుత్వం
  • 24, 27 తేదీల్లో ఇంటర్వ్యూలు

హైదరాబాద్, వెలుగు : కన్ఫర్డ్ ఐఏఎస్​ పోస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన లిస్ట్​లో మంత్రుల పీఎస్​లు, ఓఎస్​డీలు ఉన్నారు. దీంతో పాటు మంత్రి కేటీఆర్ చూస్తున్న మున్సిపల్ అండ్ అర్బన్​ డెవలప్​మెంట్, ఇండస్ర్టీస్ డిపార్ట్​మెంట్ లో పనిచేస్తున్న ఆఫీసర్లే ఉన్నారు. నాన్​ రెవెన్యూలో ఖాళీగా ఉన్న ఐదు కన్ఫర్డ్​ ఐఏఎస్​ పోస్టుల కోసం 25 మంది లిస్ట్​ను కేంద్ర శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ)కి పంపింది. 

వీరికి 24, 27వ తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఈనెల 5న యూపీఎస్సీ సమాచారం పంపింది. ఈ జాబితాలో మంత్రి హరీశ్​రావు దగ్గర పీఎస్​గా పనిచేస్తున్న అశోక్​ రెడ్డి, మంత్రి కేటీఆర్​ దగ్గర ఓఎస్​డీగా ఉన్న మహేందర్, అడిషనల్ పీఎస్​ కాత్యాయనీ దేవి పేర్లున్నాయి. వీరితో పాటు గతంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఓఎస్​డీగా పనిచేసి, ప్రస్తుతం టీఎస్ ఎంఎస్​ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ కె.చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ వద్ద ఓఎస్డీగా పనిచేసిన సి.చంద్రకాంత్ రెడ్డి ఉన్నారు. టీఎస్​ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, ఇండస్ర్టీస్​ డిపార్ట్​మెంట్​లో వివిధ హోదాల్లో ఉన్న సురేశ్, డి.శ్రీనివాస్​ నాయక్, ప్రశాంత్ కుమార్ ఉన్నారు. మున్సిపల్ డిపార్ట్​మెంట్​లో పనిచేస్తున్న యాదగిరి రావు, వి.సైదా, టి.వెంకన్న పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీరితో పాటు కె.హరిత, నవీన్ నికోలస్, సర్వేశ్వర్ రెడ్డి, వి.శ్రీనివాస్​ రెడ్డి, పి.వెంకటేశం, లక్ష్మణుడు, పుల్లయ్య, ఏడుకొండలు, డి.హనుమంతు, పాపయ్య, నారాయణరావు, పద్మజ పేర్లు లిస్ట్​లో ఉన్నాయి. వీరందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించిన తర్వాతే ఐదుగురిని కన్ఫర్డ్ ఐఏఎస్​లుగా ప్రకటిస్తారు.