- పోక్సో కేసు నమోదు
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్‌లో కలకలం రేపిన మైనర్ బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన మనోజ్ (25) షేక్‌పేటలో నివసిస్తూ, జూబ్లీహిల్స్‌కు చెందిన బాలికకు ఇన్స్టాగ్రామ్ ద్వారా దగ్గరయ్యాడు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి, గత నెలలో మహారాష్ట్రకు తీసుకెళ్లాడు.
బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు.. సాంకేతిక ఆధారాలతో నిందితుడి ఆచూకీ కనిపెట్టి బాలికను సురక్షితంగా రక్షించారు. నిందితుడు మనోజ్‌ను మంగళవారం అదుపులోకి తీసుకొని, అతనిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

