- పరిశీలనలో ప్రతిపాదనలు
- ఇందిరమ్మ స్కీమ్ కింద రూ. 50 వేలు ఇస్తం
- మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇందిరమ్మ మైనార్టీ యోజన పథకం కింద 1,774 మంది లబ్ధిదారులకు రూ. 50 వేలు, రేవంత్ అన్న సహారా మిస్కిన్ కింద 60 మందికి మోపెడ్లు, 1, 200 మందికి ఈ స్కూటర్లు అందించే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ తెలిపారు. మైనార్టీ యోజన పథకం కింద ఇచ్చే రూ.50 వేలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. మంగళవారం ఉర్దూ మస్కన్ ఆడిటోరియం ఖిల్వత్ లో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనార్టీ యువతకు సంక్షేమ పథకాల అవగాహన సదస్సు నిర్వహించారు.
దీనికి కలెక్టర్హరిచందన, చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫేఖర్ అలీ హాజరయ్యారు. కలెక్టర్హరిచందన మాట్లాడుతూ మైనార్టీ యువత కోసం మే 28న మెగా లోన్ మేళా నిర్వహించనున్నామని, దీనికి అన్ని బ్యాంకుల ఆఫీసర్లు అందుబాటులో ఉంటారన్నారు. అలాగే, స్కిల్ డెవలప్‌మెంట్ లో భాగంగా 1,820 మందికి వివిధ రంగాల్లో ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. తర్వాత రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్లో ఎక్కువ మార్కులు సాధించిన టాపర్లను సన్మానించి సర్టిఫికెట్లు అందజేశారు. కలెక్టర్ తో కలిసి మైనార్టీ మహిళలకు 40 కుట్టుమిషన్లను అందజేశారు.

