హైదరాబాద్: మైనర్లకు సిగరెట్ల విక్రయం, ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్:   మైనర్లకు సిగరెట్ల విక్రయం, ఇద్దరు అరెస్ట్
  • రూ.60 వేల విలువైన పొగాకు ఉత్పత్తులు స్వాధీనం
  • 22 సార్లు నిఘా పెట్టి పట్టుకున్న ఈగల్ ఫోర్స్

పద్మారావునగర్, వెలుగు: మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తున్న పాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్  యజమానితో పాటు అందులో పని చేస్తున్న ఉద్యోగిని ఈగల్  ఫోర్స్  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్  బోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలోని లిమ్రా పాన్  మహల్ లో 14, 17 ఏళ్ల వయసున్న ఇద్దరు మైనర్లు సిగరెట్లు కొనుగోలు చేస్తున్న విషయాన్ని ఈగల్  ఫోర్స్  గుర్తించింది. 

పక్కా ఆధారాలు సేకరించేందుకు అధికారులు ఏకంగా 22 సార్లు దుకాణంపై నిఘా ఉంచారు. అనంతరం బోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి పోలీసులతో కలిసి పాన్ షాప్​పై దాడి చేశారు. ఓనర్​ మహ్మద్  యూసుఫ్ఉద్దీన్  గౌరీ, ఉద్యోగి మహ్మద్  రెహాన్  అలీని అరెస్ట్  చేశారు. అనంతరం తనిఖీలు నిర్వహించి రూ.60 వేల విలువైన పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి పోలీసులకు అప్పగించారు.