ఇండియన్స్ సివిక్ సెన్స్ గురించి ఇప్పటికే ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం కదా. పక్కన ఉన్నవాళ్లు ఏమనుకుంటారు.. మనం చేసే పనుల వలన ఇతరులకు ఎంత ఇబ్బంది కలుగుతుంది..? అనే సోయి లేకుండా కంపు లేపడం మనవాళ్ల స్పెషాలిటీ. ముఖ్యంగా పబ్లిక్ బస్టాండ్, రైల్వే స్టేషన్స్ లాంటి స్థలాలలో ఓపెన్ గా యూరిన్ చేయడం పెద్ద సమస్యగా మారింది. అక్కడక్కడ ఇచ్చట మూత్రం పోసిన వాడు గాడిద.. అనే బోర్డులు పెట్టినప్పటికీ.. హా అన్నంతలోనే అయిపోతామా అన్నట్లుగా పని కానిచ్చేస్తుంటారు. అలాంటి వాళ్ల కోసమే కార్ణాటక మైసూరు అధికారులు సరికొత్త ఐడియా ఆలోచించారు.
అప్పట్లో రోడ్డుపైన, పబ్లిక్ ప్లేస్ లో యూరిన్ చేసేవారికి దండలు వేసి సత్కరించేవాళ్లు. కానీ అలా ఎంత మందిని ఫాలో అవుతాం.. ఎందరికని వేస్తాం. ఇది వర్కవుట్ అవ్వడం లేదని.. గోడలకు మిర్రర్స్ అమర్చారు మైసూరు అధికారులు. మైసూరు సబర్బన్ బస్ స్టాండ్ దగ్గర పెద్ద ఎత్తున మిర్రర్స్ ఏర్పాటు చేశారు. ఎక్కువగా మూత్రం చేసే ప్రాంతాలలో పెద్ద పెద్ద అద్దాలను గోడల దగ్గర పెట్టారు. దీంతో.. కనీసం అద్ధం చూసైనా బుద్ధి రావాలి అని అంటున్నారు. ఓపెన్ యూరినేషన్ ను అడ్డుకునేందుకు అధికారుల ఈ కొత్త ఆలోచన చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- సోషల్ మీడియాలో వైరల్:
అధికారుల ఆలోచనను యూజర్లు మెచ్చుకుంటున్నారు. కానీ అదే సమయంలో.. హైజీనిక్ గా.. నీట్ గా ఉండే రెస్ట్ రూమ్స్ అందుబాటులో లేకపోవడంపై ప్రశ్నిస్తున్నారు. హైజీనిక్ టాయిలెట్స్ నిర్మించడంపై అధికారులు ఫోకస్ చేయాలని.. అప్పుడు ఓపెన్ యూరినేషన్ తగ్గుతుందంటున్నారు.
సులభ్ కాంప్లెక్స్ లాంటి పబ్లిక్ టయిలెట్స్ ఉన్నప్పటికీ.. ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా.. దారుణంగా ఉండే టాయిలెట్స్ కూడా ఎక్కువ వసూలు చేస్తున్నారు. అందుకోసమే జనాలు వీధుల బాట పడుతున్నారని అంటున్నారు. గోడల దగ్గర మిర్రర్స్ పెట్టి డబ్బులు వృధా చేసే బదులు.. ఉన్న టాయిలెట్స్ ను నీటుగా ఉండేలా చూసేందుకు మార్షల్స్ ను నియమించాలని.. ఎప్పటికప్పుడు పర్యవేక్షణతో ఆ సమస్య తీరుతుందని అంటున్నారు.
మరి కొందరు.. మిర్రర్స్ పెడితే ఎన్నాళ్లుంటాయి అని ప్రశ్నిస్తున్నారు. ఇంటి కిటికీలకు ఉండే అద్దాలనే పగలగొట్టే ఆకతాయిలు ఉండే మన దగ్గర రోడ్లపై ఉండే అద్దాలను ఉంచుతారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈజీగా డ్యామేజ్ కావడం.. డస్ట్ తో పాడైపోవడం మొదలైన సమస్యలు రావచ్చని అంటున్నారు.
