హైదరాబాద్ లో కనువిందు చేసిన అందాల షో..

హైదరాబాద్ లో  కనువిందు చేసిన అందాల షో..
  •     ఘనంగా మిస్ అండ్​మిసెస్ 
  •       బెలెజా తెలంగాణ గ్రాండ్ ఫినాలే


హైదరాబాద్ సిటీ, వెలుగు: సోమాజిగూడలోని హోటల్ కత్రియాలో సోమవారం మిస్, మిసెస్ బెలెజా తెలంగాణ గ్రాండ్ ఫినాలే సీజన్ –-2 వేడుక ఘనంగా జరిగింది. రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి నేరెళ్ల మల్యాద్రితో కలిసి బెలెజా వ్యవస్థాపకురాలు వందన దాసరి, మిస్ ఇండియా ఏషియా పసిఫిక్, సోషలైట్ సుధా జైన్, టీమ్ మెంబర్లు గుర్జీత్, సమ్రీన్, అడ్వొకేట్​నందిని జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఈవెంట్​లో డాక్టర్లు, ఐటీ ఎంప్లాయీస్, ఫ్యాషన్‌‌ డిజైనర్లు, ఔత్సాహిక  మోడల్స్, హౌస్​వైవ్స్​తో పాటు విభిన్న రంగాలకు చెందిన  20 మంది ఫైనలిస్టులు పోటీ పడ్డారు. మిస్ కేటగిరీ విజేతగా డి. కావ్యాంజలి, ఫస్ట్ రన్నరప్​గా కందకట్ల ప్రత్యూష, సెకండ్ రన్నరప్‌‌గా వి. జానకీ దేవి నిలవగా, మిసెస్ కేటగిరీ విజేతగా ఇందిరా దేవి, ఫస్ట్ రన్నరప్‌‌గా డా. పి.నిఖిలా రెడ్డి, సెకండ్ రన్నరప్‌‌గా అవుల 
రేవతి నిలిచారు.