మహిళల భద్రతకు తెలంగాణ ఆదర్శం : మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్

మహిళల భద్రతకు తెలంగాణ ఆదర్శం : మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్
  • హైదరాబాద్​లో ఉమెన్ సేఫ్టీ బాగుంది: మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్
  • ముగిసిన హెడ్- టు- హెడ్ ఛాలెంజ్ ఫైనల్

హైదరాబాద్, వెలుగు: మహిళల భద్రత, సాధికారతకు తెలంగాణ ఆదర్శమని మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అన్నారు. మహిళలు స్వేచ్ఛగా జీవించడానికి తెలంగాణ అనువైన ప్రదేశమని కొనియాడారు. హైదరాబాద్​లో ఉమెన్ సేఫ్టీ ఎంతో బాగుందని కితాబిచ్చారు. 72వ మిస్ వరల్డ్ పోటీలో భాగంగా హెడ్- టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్ శుక్రవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని హోటల్ ట్రైడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగింది. యూరప్, ఆఫ్రికా, ఆసియా అండ్ ఓషియానియా, అమెరికా అండ్ కరేబియన్ నుంచి ఐదుగురు చొప్పున మొత్తం 20 మంది ఈవెంట్​లో పాల్గొన్నారు.

 ఫైనల్ రౌండ్​లో 20 మంది ఫైనలిస్టులు మరోసారి తమ సామాజిక దృక్పథం, ఆశయాలను వివరించారు. తెలంగాణ అభివృద్ధి, మహిళల భద్రత, వాతావరణ మార్పుపై కంటెస్టెంట్స్​కు న్యాయనిర్ణేతలు ప్రశ్నించారు. వాళ్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. బ్రెజిల్, సురినామ్, కేమెన్ ఐలాండ్స్, గయానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు తెలంగాణ అభివృద్ధి, భద్రత గురించి వివరించారు. ‘సవాళ్లు మీ ఎదుగుదలకు ఎలా అవకాశంగా మారింది..?’అనే ప్రశ్నకు దక్షిణాఫ్రికా, నమీబియా, సోమాలియా, ఉగాండా,  జాంబియా పోటీదారులు స్పందించారు.

 ఆఫ్రికన్ కాంటినెంట్ విజేతగా నిలిచిన మిస్ జాంబియా.. క్లినికల్ మెడిసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి చేసి స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హైలైట్ చేస్తూ స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశారు. తుది రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆఫ్రికన్ ఫైనలిస్టులు మాట్లాడుతూ.. యువతపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపుతున్నదన్నారు. ‘తెలంగాణను ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తారు’అని నలుగురు ఖండాంతర విజేతలను(టర్కీ, వేల్స్, జాంబియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో) ప్రశ్నించారు. తెలంగాణను సాంకేతిక, వైద్య ఆవిష్కరణల కేంద్రంగా వాళ్లు అభివర్ణించారు. తెలంగాణ సంస్కృతి ఎంతో బాగుందని కితాబిచ్చారు. హెడ్ టు హెడ్ చాలెంజ్​లో మిస్ వేల్స్, మిస్ టర్కీ, మిస్ ట్రినిడాడ్ అండ్  టొబాగో, మిస్ జాంబియా విజేతలుగా నిలిచారు.