వ్యవసాయం చేసే తీరు మార్చాలని.. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్..

వ్యవసాయం చేసే తీరు మార్చాలని.. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్..

త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ జంటగా మధుదీప్ చెలికాని తెరకెక్కించిన చిత్రం ‘మిస్టర్‌‌‌‌ వర్క్ ఫ్రమ్ హోమ్‌‌’. అరవింద్ మండెం నిర్మించారు. ఫిబ్రవరి 13న సినిమా విడుదల కానుంది.   వైజాగ్‌‌ ఫిల్మ్ నగర్ సెంటర్‌‌‌‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ నిర్వహించారు.  ఈ సందర్భంగా దర్శకుడు మధు మాట్లాడుతూ ‘వ్యవసాయంలో  నూతన యంత్ర పరికరాలు వినియోగం నేపథ్యంలో జరిగే కథ ఇది.  వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ తన గ్రామంలో  వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించే యువకుడిగా త్రిగుణ్‌‌ కనిపిస్తారు.  

ప్రేమ, పెళ్లితో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌‌తో తెరకెక్కించాం’ అని చెప్పాడు. వ్యవసాయం చేసే విధానం మారితే, దాన్ని చూసే తీరు మారుతుందనే సందేశంతో తెరకెక్కించిన ఈ చిత్రం నేటి సమాజానికి ఎంతో అవసరం అని హీరో త్రిగుణ్ అన్నాడు.  ప్రేక్షకుల ప్రశంసలు అందుకునేలా దర్శకుడు తెరకెక్కించాడని నిర్మాత అరవింద్‌‌ చెప్పారు. సినిమా టీమ్ అంతా పాల్గొన్నారు.