
2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ పొట్టి సమరానికి ఇప్పటికే 20 జట్లలో ఇప్పటివరకు 15 జట్లు అర్హత సాధించాయి. ఈ మెగా టోర్నీకి అన్ని జట్లు ఇప్పటి నుంచే సన్నాకాలు ప్రారంభించేశాయి. ఐసీసీ టోర్నీ అంటే అద్భుతంగా ఆడే ఆస్ట్రేలియా మరో ఆరు నెలల్లో జరగబోయే వరల్డ్ కప్ కు వారి ఓపెనర్లను కన్ఫర్మ్ చేసింది. ఆదివారం (ఆగస్టు 10) నుంచి సౌతాఫ్రికాతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది.ఈ సిరీస్ లో ఆడే ఆసీస్ జట్టే దాదాపు వరల్డ్ కప్ కు ఆడనుంది.
ఈ సిరీస్ కు ముందు మీడియాతో మాట్లాడిన ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ సౌతాఫ్రికా సిరీస్ తో పాటు టీ20 వరల్డ్ కప్ కు తమ ఓపెనర్లు ఎవరో చెప్పేశాడు. తనతో పాటు ట్రావిస్ హెడ్ ఓపెనర్లగా బరిలోకి దిగుతామని మార్ష్ కన్ఫర్మ్ చేశాడు. మార్ష్, హెడ్ ఇప్పటివరకు వన్డేల్లో మాత్రమే ఓపెనింగ్ చేశారు. టీ20 క్రికెట్ లో వీరిద్దరూ కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తే ప్రత్యర్థులకు ఇబ్బందులు తప్పవు. మాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ లాంటి యంగ్ క్రికెటర్లకు అవకాశాలు ఇచ్చినా వారు సద్వినియోగం చేసుకోలేకపోయారు. టీ20 క్రికెట్ లో హెడ్ రెండో ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. మరోవైపు ఇటీవలే ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జయింట్స్ తరపున మార్ష్ దుమ్ములేపాడు.
ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టీ20 షెడ్యూల్:
ఆదివారం, 10 ఆగస్టు 2025
మొదటి టీ20 మ్యాచ్ – ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా
మర్రారా స్టేడియం, డార్విన్
మంగళవారం, 12 ఆగస్టు 2025
రెండవ టీ20 మ్యాచ్ - ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా
మర్రారా స్టేడియం, డార్విన్
శనివారం, 16 ఆగస్టు 2025
మూడో టీ20 మ్యాచ్ – ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా
కాజాలిస్ స్టేడియం, కైర్న్స్
2007లో తొలిసారి టీ20 ప్రపంచ కప్ ప్రారంభమైంది. అప్పటి నుంచి పొట్టి సమరాన్ని రెండేళ్ల కొకసారి నిర్వహిస్తూ వస్తున్నారు. మధ్యలో కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడడం తప్పితే ప్రతి రెండు సంవత్సరాలకు ఐసీసీ ఈ టోర్నీ నిర్వహిస్తూ వస్తుంది. 2007, 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022, 2024లో టీ20 వరల్డ్ కప్ జరిగింది. గత ఏడాది జరిగిన 2024 టీ20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలుచుకుంది. ఆస్ట్రేలియా చివరిసారిగా 2021లో టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది.
►ALSO READ | Zach Vukusic: పసికూన ఆటగాడు ప్రపంచ రికార్డ్.. 17 ఏళ్లకే ఇంటర్నేషనల్ కెప్టెన్సీ బాధ్యతలు
🚨 AUSSIE OPENERS LOCKED IN. 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 8, 2025
- Mitchell Marsh to open with Travis Head at the 2026 T20 World Cup. pic.twitter.com/EwUd8EM1qh