సంతోషానికి కేరాఫ్ అడ్రస్​గా మిజోరం!

సంతోషానికి కేరాఫ్ అడ్రస్​గా మిజోరం!

ఐజాల్: దేశంలో అత్యంత సంతోషంగా ఉన్న రాష్ట్రంగా మిజోరం నిలిచింది. గురుగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజేశ్ కె.పిల్లానియా చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. 100% అక్షరాస్యతను సాధించిన మిజోరం.. క్లిష్ట పరిస్థితుల్లోనూ స్టూడెంట్లు ఎదిగేందుకు అవకాశాలు ఇస్తోందని రిపోర్టులో పేర్కొన్నారు. ‘‘మిజోరం హ్యాపీనెస్ ఇండెక్స్.. కుటుంబ సంబంధాలు.. పనికి సంబంధించిన అంశాలు.. సామాజిక అంశాలు, దాతృత్వం.. మతం.. హ్యాపీనెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కరోనా ప్రభావం.. శారీరక, మానసిక ఆరోగ్యం.. అనే పారామీటర్లపై ఆధారపడి ఉంది” అని వివరించారు.

కుల రహిత సమాజం..

మిజోరం సామాజిక నిర్మాణం కూడా యువత ఆనందానికి దోహదం చేస్తున్నది. ‘‘మాది కుల రహిత సమాజం. అలాగే ఇక్కడ చదువుల విషయంలో పిల్లలపై తల్లిదండ్రుల ఒత్తిడి చాలా తక్కువ’’ అని ఎబెనెజర్ బోర్డింగ్ స్కూల్ టీచర్ సిస్టర్ లాల్రిన్మావి ఖియాంగ్టే అన్నారు. మిజో కమ్యూనిటీలో జెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చిన్న వయసు నుంచే సంపాదించడం మొదలుపెడతారని రిపోర్టు తెలిపింది. 16 –17 ఏండ్లకే ఉద్యోగాన్ని సాధిస్తారని చెప్పుకొచ్చింది. మిజోరంలో విడిపోయిన కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ.. అక్కడ వర్కింగ్ మదర్స్ ఉన్నారు. పిల్లలు చిన్న వయస్సు నుంచే ఆర్థిక స్వాతంత్ర్యం కలిగి ఉంటున్నారు. దీన్ని బట్టి చూస్తే.. పిల్లలను అలానే విడిచిపెట్టడం లేదు. వారి బాగోగులను చూసుకుంటూ.. స్వతంత్రంగా ఎదగనిస్తున్నారని తెలుస్తోంది.