మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్కు ఆహ్వానం

మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్కు ఆహ్వానం

ఈ నెల 13నుండి వరంగల్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా  ఆలయ వేదపండితులు సీఎం కేసీఆర్ కు వేద మంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు.ముఖ్యమంత్రిని కలిసి వారిలో ఎమ్మెల్యేతో పాటు డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఆలయ ఈవో నాగేశ్వర రావు, ఆలయ మాజీ చైర్మన్ మునిగాల సమ్మయ్య, ప్రధాన అర్చకులు రవీందర్, విక్రాంత్ జోషి, మధుకర్ శర్మ,పురుషోత్తమ శర్మ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన హనుమకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 13 నుండి ఉగాది వరకు ఇక్కడ వైభవంగా జరిగే ఉత్సవాలు జరగనున్నాయి. భోగి, మకర సంక్రాంతి బండ్లు తిరుగుట, రేణుకా ఎల్లమ్మ పండగ, శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఉగాదితో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  అన్ని చర్యలు చేపట్టారు.