
జూబ్లీహిల్స్, వెలుగు: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ , కల్చరల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఆదివారం ఎన్నికలు జరగగా, యునైటెడ్ ప్యానెల్ విజయం సాధించింది. కొత్త అధ్యక్షుడిగా డాక్టర్ వైవై రెడ్డి, కార్యదర్శిగా కె రామచంద్రారెడ్డి, కోశాధికారిగా జి.మధుసూదన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా కె లక్ష్మీ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా ఎం ఉపేందర్ రెడ్డి, మరో తొమ్మిది మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి పి.నారాయణ రెడ్డి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.