దమ్మపేట: ‘విద్యా యాత్ర’ ప్రారంభించిన ఎమ్మెల్యే

దమ్మపేట: ‘విద్యా యాత్ర’  ప్రారంభించిన ఎమ్మెల్యే

దమ్మపేట, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విద్యారంగ అభివృద్ధిలో భాగంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు విద్యను చేరువ చేసేందుకు ‘నేను సైతం చేయూత– విద్య అభివృద్ధి, విద్యా యాత్ర’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. మంగళవారం మండలంలోని గండుగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్లే కార్డును ప్రదర్శించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, మౌలిక వసతులు, విద్యార్థులకు అందుతున్న విద్యా ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రగ్స్ వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.