V6 News

ఉన్నావ్ కేస్ : MLAను పార్టీ నుంచి బహిష్కరించిన BJP

ఉన్నావ్ కేస్ : MLAను పార్టీ నుంచి బహిష్కరించిన BJP

ఉన్నావ్ రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యూపీ MLA కులదీప్ సింగ్ సెంగార్ ను.. పార్టీ నుంచి బహిష్కరించింది బీజేపీ. ఈ కేసులో ఆరోపణలు వచ్చినప్పుడే పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్ చేసింది నాయకత్వం.

జులై 28న యూపీలోని రాయబరేలీ దగ్గర ఉన్నావ్ రేప్ కేస్ బాధితురాలి కారుకు యాక్సిడెంట్ అయింది. ఈ ఘటనలో ఆమె బంధువులు ఇద్దరు మృతి చెందారు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలికి యూపీ పోలీసులు సరైన భద్రత కల్పించలేదని…. బీజేపీ నాయకత్వం తీరుపై ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేతలు తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతున్నారు. దీంతో… బీజేపీ కఠిన చర్యలకు దిగింది. ఆ ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించింది.

పోలీసుల దిద్దుబాటు చర్యలు

ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలికి తాము అవసరమైన భద్రతను కల్పించామని యూపీ పోలీసులు చెప్పారు. గతంలోనే ఆమె కోరిక మేరకు.. ఇద్దరు మహిళా గార్డులు సహా.. ముగ్గురు పోలీసులతో భద్రత కల్పించామన్నారు. ఐనప్పటికీ యాక్సిడెంట్ జరగడంతో… విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ఆ ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో ఇద్దరు మహిళా పోలీసులు కూడా ఉన్నారు.