- ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
రామచంద్రాపురం, వెలుగు: రిటైర్డ్ ఎంప్లాయీస్ సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని మయూరి నగర్లో సోమవారం ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను పదవిలో ఉన్నా లేకున్నా రిటైర్డ్ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామిరెడ్డి, సభ్యులు రాములు, నాగభూషణం, అంజయ్య, పరమేశ్‌యాదవ్, ఐలేష్యాదవ్ పాల్గొన్నారు.
