- ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్
బాల్కొండ, వెలుగు: తరుగు పేరిట మిల్లర్లు దోచుకుంటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. శనివారం బాల్కొండలోని కిసాన్ నగర్ మార్కెట్ యార్డ్‌ను సందర్శించిన ఆయన ధాన్యం కొనుగోలు జాప్యం, రైస్ మిల్లర్ల దోపిడీపై ప్రశాంత్ రెడ్డి అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా 41.5 కేజీలకు బదులు 44.5 కేజీలు ఇస్తేనే దించుకుంటామని ముకుంద రైస్ మిల్లు అడ్డగోలు నిబంధనలు పెడుతోందని, దీంతో క్వింటాల్‌కు 10 కేజీలు అదనపు తరుగు పేరిట రైతులను దోచుకుంటున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించని ముకుంద రైస్ మిల్లును తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
