V6 News

ప్రజాప్రభుత్వంలో అన్నివర్గాలకు మేలు  :  ఎమ్మెల్యే రాందాస్ నాయ

ప్రజాప్రభుత్వంలో అన్నివర్గాలకు మేలు  :  ఎమ్మెల్యే రాందాస్ నాయ

కారేపల్లి, వెలుగు: ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని మాధారంలో శుక్రవారం విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

అనంతరం గాదెపాడులో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన నాలుగు మక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఏవో అశోక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.