పదేళ్లలో ఏమీ చేయనోళ్లు ఇప్పుడేం చేస్తారు? : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

పదేళ్లలో ఏమీ చేయనోళ్లు ఇప్పుడేం చేస్తారు? : ఎమ్మెల్యే  మైనంపల్లి రోహిత్
  •     ఎమ్మెల్యే  మైనంపల్లి రోహిత్ 

మెదక్, వెలుగు: పదేళ్లు అధికారంలో ఉండి మెదక్​ను అభివృద్ధి చేయని వారు ఇప్పుడు  గెలిస్తే ఏం చేస్తారని ఎమ్మెల్యే రోహిత్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మెదక్ రాందాస్ చౌరస్తాలో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నన్నాళ్లు దోచుకుని దాచుకున్నారు తప్ప ప్రజలకు ఏమీ చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏం జరిగిందో ఆయన కూతురే చెబుతుందన్నారు. ప్రజల్ని మోసం చేయడానికి బీఆర్ఎస్ నాయకులు మళ్లీ మాయ మాటలు చెబుతున్నారని విమర్శించారు. 

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు  కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు మాట్లాడుతూ.. మెదక్ అభివృద్ధి కాకపోవడానికి మాజీ మంత్రి హరీశ్ కారణమన్నారు. సభలో డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్, నాయకులు చంద్రపాల్, కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.